పవన్ ఫ్యాన్స్‌కి అల్లు అర్జున్ నచ్చేశాడా..?
on Jan 4, 2018
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కి.. పవన్ ఫ్యాన్స్‌కి జరుగుతున్న కోల్డ్‌వార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెప్పను బ్రదర్ అన్న తర్వాత.. సోషల్ మీడియా సాక్షిగా బన్నీని ఒక ఆట ఆడుకుంటున్నారు పవర్‌స్టార్ అభిమానులు. ఇదే మూవ్మెంట్లో రిలీజైన దువ్వాడ జగన్నాథం టీజర్ వారి ఆగ్రహానికి బలైపోయింది. టీజర్ విడుదలైన రోజు యూట్యూబ్‌లో లైకులతో.. డిజ్‌లైక్స్ పోటీపడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందో.. దీని వెనుక ఎవరున్నారో అన్నది టాలీవుడ్లో అందరికి తెలుసు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన డీజే డిజాస్టర్‌గా నిలిచింది.
దీని నుంచి తేరుకుని వక్కంతం వంశీ దర్శకత్వంలో "నా పేరు సూర్య" సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. ఆ మూవీ టీజర్‌ను న్యూఇయర్ కానుకగా జనవరి 1న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. అయితే బన్నీని డీజే నాటి భయం వెంటాడింది. కానీ టీజర్‌కు పాజిటివ్ టాకే వచ్చింది.. విడుదలైన 29 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని ఫాస్టెస్ట్‌గా 10 మిలియన్ మార్క్‌ను టచ్ చేసిన టీజర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.
ఇంత వరకు తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమా టీజర్ ఇంత తక్కువ సమయంలో 10 మిలియన్ మార్కు అందుకోలేదు. ఆఖరికి బాహుబలి, అజ్ఞాతవాసికి కూడా ఈ గౌరవం దక్కలేదు. ఈ సంగతి పక్కనబెడితే.. అల్లు అర్జున్‌ని మరోసారి పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారని.. బన్నీని బద్నామ్ చేయడం ఖాయమని ఫిలింనగర్లో జోరుగా వార్తలు వినిపించాయి. కానీ అవేవి లేకుండా వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో బన్నీని పవర్‌స్టార్ ఫ్యాన్స్ పట్టించుకోలేదా..? లేక ఈ రగడకు శుభంకార్డు వేశారా లేక స్టైలీష్ స్టార్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారా..? అన్న వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి ఏ గొడవ లేకుండా టీజర్ సాగిపోతుండటంతో బన్నీ ఫుల్ ఖుషిలో ఉన్నాడట.