ప్రభాస్ గురించి " ఆ " వార్త నిజమేనా..?
on Dec 26, 2017
ప్రాంతీయ హీరోలు అంటే వారున్న ప్రాంతం వరకే వారు హీరోలన్నమాట. అంటే... ఏ రాష్ట్రంలో వారు స్టారో...ఆ రాష్ట్రం వరకే వారి హడావిడీ... హంగామా. అయితే... ఇది ఒకప్పటి మాట. ‘బాహుబలి’ రాకముందు మాటలు ఇవన్నీ. ఏ ముహూర్తాన ‘బాహుబలి’ సినిమాలు విడుదలయ్యాయో... ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు... దక్షిణాది హీరోలందరిపై భారత సినీ ప్రేక్షకుల దృష్టి మళ్లింది. ‘బాహుబలి’ హీరో కాబట్టి... ప్రభాస్ పై ఆ ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉండటం సహజం.
బాలీవుడ్ దర్శకులు సైతం ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్న సమయం ఇది. ఈ స్థాయి పాపులారిటీ మొన్నటివరకూ దక్షిణాదిన ఒక రజనీకాంత్ కు మాత్రమే ఉండేది. ‘బాహుబలి’ పుణ్యమా అని ఇప్పుడు ప్రభాస్ కు కూడా ఆ స్థాయి పాపులారిటీ వరించిందని చెప్పాలి.
అందుకే పరభాషా దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వారిలో ముందు వరుసలో ఉన్న దర్శకుడు ‘అట్లీ'. ప్రస్తుతం కోలీవుడ్ అట్లీ ఓ సంచలనం. శంకర్ శిష్యునిగా కెరీర్ ప్రారంభించిన అట్లీ. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకునిగా తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ‘తేరీ’ తో మలి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక విజయ్ కథానాయకునిగా ఆయన తెరకెక్కించిన ‘మెర్సల్’ ఎంత విజయం సాధించిందో తెలిసిందే. దక్షిణాదిన ‘బాహుబలి’ తర్వాత అది పెద్ద విజయం ‘మెర్సల్’ చిత్రమే.
ప్రస్తుతం ‘అట్లీ’ దృష్టి మొత్తం ప్రభాస్ పైనే. ఇటీవల ప్రభాస్ ని కలవడం కూడా జరిగిందట. ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ నత్త నడకన నడుస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా ప్రభాస్ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దాంతో ఈ అవకాశాన్నే అందిపుచ్చుకొని ప్రభాస్ కోసం ఓ అద్భుతమైన కథ తయారు చేసే పనిలో పడ్డాడు అట్లీ. ప్రభాస్ కూడా అట్లీతో చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన కథ.. కూడా యూనివర్సల్ రేంజ్ లో ఉండేలా అట్లీ ప్లాన్ చేస్తున్నాడట.
ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే...అభిమానులకు పండగే కదా.
Also Read