ENGLISH | TELUGU  

నాగ్.. తెలివే.. తెలివి..!!

on Dec 21, 2017

తన కొడుకు అఖిల్ ఫస్ట్ మూవీ ఫట్ అవ్వడంతో.. రెండో సినిమా ద్వారా హిట్టు కొట్టించి హీరోగా నిలబెట్టాలని పక్కా ప్లానింగ్‌తో వెళుతున్నాడు నాగార్జున. దీనిలో భాగంగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటించిన హలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్‌ను భారీగా చేస్తున్న నాగ్.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించి.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవిని ఆహ్వానించాడు. తన ఆప్తమిత్రుడు పిలిచిందే తడువుగా కొడుకు రామ్‌చరణ్‌ని వెంటబెట్టుకుని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో వాలిపోయాడు మెగాస్టార్. మొదట మాట్లాడిన చరణ్.. అఖిల్‌తో తనకున్న రిలేషన్‌ గురించి మాట్లాడాడు. ఇక ఆ తర్వాత మైక్ అందుకున్న చిరు.. ఏఎన్నార్ దగ్గరి నుంచి అఖిల్ వరకు ప్రతిఒక్కరిని ప్రస్తావించాడు.

తాత, నాన్న, అన్నను మించిన నటుడు అఖిల్‌ అని.. ఈ సినిమాతో అఖిల్ మరో మెట్టుకు ఎదిగిపోయాడని అన్నారు. అసలు చిరు లాంటి వ్యక్తి ఇంతగా అక్కినేని ఫ్యామిలీని పొగడటం ఏంటా అని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు సవాలక్షా కారణాలు వినిపిస్తున్నాయి..

మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున మధ్య ఉన్న సాన్నిహిత్యం టాలీవుడ్‌లో అందిరికీ తెలిసిందే. వీరిద్దరూ మంచి మిత్రులే కాకుండా వ్యాపార భాగస్వాములు అన్నది ఓపెన్ సీక్రెట్. స్వతహాగా మంచి బిజినెస్ మైండ్ ఉన్న నాగార్జున తన ఫ్రెండ్‌ చిరంజీవికి వ్యాపారపరమైన సలహాలు అందజేస్తుంటూ.. ఒకరి అవసరాలు ఒకరు తీరుస్తూ ఉంటారు. హలోని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన నాగ్.. తెలుగునాట భారీగా ఉన్న మెగా ఫ్యాన్స్‌ దృష్టిని. ఇటు మళ్లీంచే ప్లాన్‌లో భాగంగా చిరంజీవిని రప్పించారు అంటున్నారు సినీజనాలు. మరి మిత్రుడు అడిగితే చిరు కాదంటారా..? అందుకే తండ్రి, కొడుకులు అక్కినేని ఫ్యామిలీని బాగా ఎత్తారు అంటూ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.