ఈ ఫోటోలో మిస్సయ్యింది ఆయనొక్కరే..?
on Nov 14, 2017
నాగచైతన్య- సమంత వెడ్డింగ్ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరైన వేళ మొత్తం అక్కినేని ఫ్యామిలీతో చిరు ఫోటో దిగారు. ఆ సమయంలో ఆ ఫ్రేమ్‌లో నాగచైతన్య, సమంత, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అఖిల్, అమల, నాగసుశీల ఉన్నారు. ఇలాంటి ఈవెంట్లకు ఎప్పటి నుంచో హాజరవుతున్న కొందరి మెదళ్లులో ఒక ఆలోచన మెదిలింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరం తర్వాత తెలుగు సినిమాను నాలుగు స్థంభాలుగా మోస్తున్నారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. ఒకరితో ఒకరు పోటీపడి సినిమాలు చేసుకుంటూ నెంబర్ గేమ్‌లో ఒకరు టాప్‌లో ఉన్నా కానీ.. నాటి నుంచి నేటి వరకు అందరూ స్నేహితులుగానే మెలిగారు. పరిశ్రమకు సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా నలుగురు కలిసే పాలుపంచుకునే వారు. ఎవరి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మిగిలిన ముగ్గురు తప్పకుండా హాజరవ్వడం ఆనవాయితీగా మారింది. అయితే తాజా ఈవెంట్లో నందమూరి నటసింహం బాలకృష్ణ కనిపించలేదు. ఆయన కూడా ఉండి ఉంటే ఫోటో మరింత కలర్ఫుల్గా ఉండేదని వారు అనుకున్నారు. నాగ్‌తో ఉన్న మనస్పర్థల కారణంగానే బాలకృష్ణ రిసెప్షన్‌కు దూరంగా ఉన్నారని ఫిలింనగర్ టాక్.
Also Read