చరణ్‌ని భయపెట్టిన పవన్?
on Nov 3, 2017
స్టార్ హీరోల సినిమా సెట్స్ లో ఉన్నప్పుడు.. మీడియా దృష్టంతా ఆ సినిమాపైనే ఉంటుంది. ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం తహ తహ లాడిపోతుంటారు. లేకపోతే.. వాళ్లే కొత్తవి పుట్టిచ్చేస్తుంటారు. ఇటీవల రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా గురించి కూడా రకరకాల గాసిప్పులు మీడియా సర్కిల్ లో వినిపిస్తున్నాయ్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ.. సమ్మర్ కి పోస్ట్ పోోన్ అయ్యింది. ఇంకేముందీ.. మనోళ్లకు న్యూస్ దొరికేసింది. దాన్ని పట్టుకొని ఏదో ఒకటి రాసేశారు. ఇందులో గ్రాఫికల్ వర్క్ ఎక్కువగా ఉందనీ.. అందుకే.. సమయం ఎక్కువ తీసుకొని అయినా... ‘బాహుబలి’ కంటే గొప్పగా గ్రాఫిక్స్ ఉండేలా చూసుకోడానికి సినిమాను పోస్ట్ పోన్ చేశారని ఒకాయన రాశాడు. షూటింగ్ నత్త నడకన నడుస్తోందనీ.. ఈ కారణంగా ఆర్టిస్టుల కాల్ షీట్స్ ప్రాబ్లం కూడా తలెత్తిందనీ.. అందుకే సినిమా ఆలస్యం అవుతోందని ఇంకో ఆయన రాశాడు. అయితే.. అసలు కారణం మ ాత్రం ఎవరూ రాయకపోవడం విశేషం.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అదే సీజన్ లో పవర్ స్టార్- త్రివిక్రమ్ ల సినిమా విడుదల ఉంది. బాబాయ్ సినిమా ఉండగా... అబ్బాయ్ సినిమా కూడా అదే సీజన్ లో విడుదల చేయడం ఏ మ ాత్రం శ్రేయస్కరం కాదన్నది ‘రంగస్థలం’ టీమ్ ఆలోచన. పైగా మొదట్నంచీ మెగా హీరోలందరూ ఓ పద్ధతి ప్రకారం వెళుతున్నారు. ఒకరి సినిమా మీద ఇంకొకరి సినిమా పడకుండా జాగ్రత్త తీసుకుంటుంటారు. అంతకు ముందు కూడా పవన్ సినిమా టైమ్ లోనే చరణ్ సినిమా కూడా విడుదలకు రెడీ అయ్యింది. కానీ.. బాబాయ్ కోసం బాబాయ్ పైనున్న గౌరవంతో తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు చరణ్. ఈ దఫా కూడా అదే జరిగింది. సంక్రాంతికి బాబాయ్ ఉండగా.. తాను రావడం కరెక్ట్ కాదని పోస్ట్ పోన్ చేసుకొని సమ్మర్ రేస్ లో నిలిచాడు. అదనమాట అసలు విషయం.