అదర్‌సైడ్ ఆఫ్ యంగ్ రెబల్‌స్టార్
on Oct 23, 2017
అదర్‌సైడ్ ఆఫ్ యంగ్ రెబల్‌స్టార్ ( ప్రభాస్ బర్త్‌డే స్పెషల్)
ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు అంటే టక్కున గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ప్రభాస్ అంటే వెంటనే ఓ రూపం మన ముందు కదులుతుంది. ఆరడుగుల హైట్, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్. ఆయనే యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్న రాజు గారు అనతికాలంలో అభిమానుల గుండెల్లో డార్లింగ్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.
అసలు ప్రభాస్ స్పెషాల్టీ ఏంటీ..? 6 ప్లస్ హైటా.. స్టైయిలిష్ స్మైలా.. మెస్మరైజింగ్ లుక్కా.. పవర్ఫుల్ యాక్టింగా.. యంగ్ రెబల్‌స్టార్ ఇమేజా.. అందరికీ ప్రభాస్ అంటే గుర్తొచ్చేవి ఇవే.. కానీ తనలో ఇంకో యాంగిల్ ఉంది.. అందిరితో కలిసిపోతాడు.. ఫ్యామిలీకి ప్రాణం ఇస్తాడు.. స్నేహానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇంకా ఎన్నో.. ఎన్నోన్నో ప్రభాస్‌ని అందరూ ప్రేమించేలా చేసే లక్షణాలు. అందుకే అందరూ ప్రభాస్‌కి డార్లింగ్స్.. ప్రభాస్ అందరికి డార్లింగ్ .
ప్రభాస్ మనసులోని మాటలు ఇదిగో:
* స్వతహాగా క్షత్రియ కుటుంబానికి చెందిన ప్రభాస్‌కి ఎప్పటి నుంచో రాజుల దుస్తులు, వేషధారణలో కనిపించాలని కోరిక. బాహుబలితో ఆ కోరిక తీరిందట.
* ప్రభాస్‌కి డ్యాన్స్‌లు చేయడమంటే చాలా ఇష్టమట.. కానీ సినిమాల్లోకి వచ్చాకా ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్‌లను అమితంగా ఇష్టపడుతున్నాడట. అలాగే ఇప్పుడు డ్యాన్సులు చేయాలంటే కంగారుగా ఉంటోందట.
* చెన్నై డాన్ బాస్కో పాఠశాలలో చదివే సమయంలో ప్రభాస్‌కు ఓ టీచర్ అంటే చాలా ఇష్టమట.. ఆవిడే ఆయన ఫస్ట్ క్రష్.. ఇప్పటికీ ఆవిడ మొహం ప్రభాస్‌కు బాగా గుర్తుందట.
* వర్షం సినిమాలో "మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం" అనే పాట ప్రభాస్ అల్‌టైం ఫేవరేట్ సాంగ్ అట.
* ప్రభాస్‌కి వైట్ అండ్ బ్లాక్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫంక్షన్లకు, సినిమా ఈవెంట్లకు హాజరయ్యేటప్పుడు ఈ కలర్ డ్రెస్సులనే ధరిస్తాడు.
* బాహుబలి-1లోని శివుడి క్యారెక్టర్లో ప్రభాస్ బరువెంతో తెలుసా.. 96 కేజీలు. అమరేంద్ర బాహుబలి బరువు 92 కేజీలు.
* ప్రభాస్‌కి కవితలు రాయడం రాదట.. టీనేజ్‌లో ఉండగా ఎవరైనా అమ్మాయి నచ్చితే మంచి కొటేషన్ ఉన్న రెండు, మూడు కలర్‌ఫుల్ గ్రీటింగ్ కార్డ్స్ కొని ఇచ్చేవాడట.
* వాళ్ల నాన్నగారు బాహుబలి సినిమా చూడలేకపోవడం ప్రభాస్‌ను బాగా బాధపెట్టిందట. నాన్నగారు ఆ సినిమా చూసి ఉండుంటే ఎంతో ఆనందపడేవారని ప్రభాస్ ఎన్నో సార్లు చెప్పారు.
* బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మకమైన బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. తద్వారా ఈ గౌరవం అందుకున్న మూడో భారతీయునిగా యంగ్ రెబల్‌స్టార్ రికార్డుల్లోకి ఎక్కాడు.
* ప్రభాస్ చాక్లెట్స్ విపరీతంగా ఇష్టపడతారు.. ఎంతలా అంటే చివరికి ఐస్‌క్రీమ్ తినాలన్నా అది చాక్లెట్ ఫ్లేవర్ అయ్యుండాలట.
* ప్రభాస్ బాగా బద్దకస్తుడట.. చివరికి టీ, కాఫీ పెట్టుకోవడాన్ని కూడా ఆయన చాలా కష్టమైన పనిగా ఫీలవుతారట.
Also Read