వివాద రహితుడు... అందుకే అంత క్రేజ్...
on Oct 23, 2017
ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు కథానాయకులపై ఏవో ఒక విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉండడం సర్వసాధారణమయిన విషయం. టాప్ స్టార్స్ కి అభిమానులు ఎంతమందో, ఫ్యాన్స్ కూడా దాదాపు అంతే మంది ఉంటారు. తమ హీరోనే గొప్ప అనే వాగ్వాదంలో కొందరు పక్క హీరోలకి మరియు వారి ఫ్యాన్స్ కి విమర్శకులుగా మారుతున్నారు. అయితే, ఏ వివాదాలు మరియు విమర్శకులు లేని హీరో తెలుగులో ఎవరయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. గొప్ప విషయం ఏంటంటే, దాదాపు ప్రతి హీరో అభిమానులు తమ హీరోని అభిమానిస్తూ, ప్రభాస్ ని సైతం మెచ్చుకుంటూ ఉంటారు. అది ప్రభాస్ చరిష్మా అంటే. బాహుబలి హిట్టయినపుడు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఎంత మురిసిపోయారో... అదేదో తమ హీరోనే సాధించాడు అన్నంతగా...
కలెక్షన్స్ గొడవ ఉండదు... పక్క హీరోల పై కానీ వారి కుటుంబాలపై కానీ తప్పుడు వ్యాఖ్యలు ఉండవు... తన గురించి కూడా గొప్పలు చెప్పుకోవడం ఉండదు... ఎక్కడ తాను స్టార్ ని అని అహం ప్రదర్శించింది లేదు... తన అభిమానుల్ని కానీ పక్కవారిని కానీ ఎప్పుడూ కించపరిచింది లేదు... తన దర్శక, నిర్మాతల్ని, సహ నటీ,నటుల్ని డార్లింగ్ అని పిలవడం తప్ప ఎవర్నీ ఏ క్షణంలో కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు... షూటింగ్ కి ఆలస్యంగా వచ్చాడు అని కానీ, ప్రమోషన్స్‌లో లో పాల్గొనకుండా ఇబ్బంది పెట్టాడు అన్న ఫిర్యాదులు లేవు... అందుకే ప్రభాస్ అన్ని వర్గాల వారికి డార్లింగ్ అయ్యాడు.
బాహుబలితో తెలుగు వారి సత్తా ఏంటో చూపించిన ప్రభాస్, సాహో తో మన ఖ్యాతి మరింత పెంచుతాడని ఆశిద్దాం.