మహేశ్‌ని కూడా త్రివిక్రమే గట్టెక్కించాలా..?
on Oct 3, 2017
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్..సూపర్‌స్టార్ మహేశ్ వీరిద్దరి పరిస్థితి ఇప్పుడు దాదాపు ఒకేలా ఉంది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ మూడు సినిమాలు చేయగా వాటిలో ఏ ఒక్కటి హిట్ట్ కాలేదు. అయితే పవర్‌స్టార్ స్టామినా వల్ల అవి యావరేజ్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో మంచి హిట్టు కొట్టి అభిమానులకు కానుక ఇవ్వాలనుకున్న కాటమరాయుడు తన ప్రియ మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక మహేశ్ సంగతి చూస్తే శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు చేయగా..అవి రెండు డిజాస్టర్స్‌గా మిగిలిపోయాయి. అయితే ఇప్పటికే ఓ రెండు సినిమాలకు ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను చేస్తుండగా..ఆ వెనకాలే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. వీరి తర్వాత పూరీ చెప్పిన కథకు మహేశ్ ఓకే చెప్పినట్లు ఫిలింనగర్లో వార్తలు వస్తున్నాయి. అయితే మహేశ్‌కు అదిరిపోయే హిట్ ఇవ్వడానికి త్రివిక్రమ్ రంగంలోకి దిగాడట. మహేశ్-వంశీ పైడిపల్లి మూవీ పూర్తి కాగానే..అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మూవీ అయిన వెంటనే మహేశ్-త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.