శివబాలాజీ విజయాన్ని ముందే ఇండికేట్ చేసేసిన ఎన్టీయార్!
on Sep 25, 2017
‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలేలో ఫైనల్ విన్నర్ ఎవరో ఎనౌన్స్ చేయకముందే... చాలామందికి సూచాయగా విన్నర్ ఎవరో అర్థమైపోయింది. ఆ రోజు అలాలోచితంగా ఎన్టీయార్ టంగ్ స్లిప్ అవ్వడమే దానికి కారణం. ఆ సంఘటన గురించి తెలుసుకోవాలనుందా? విషయం ఏంటంటే...
చివరిగా మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్.. శివబాలాజీ, హరితేజా, ఆదర్ష్ లలో... ఒకర్ని హౌజ్ నుంచి బయటకు పంపించడానికి ఎన్టీయార్ ఓ టాస్క్ పెట్టాడు. ‘పక్క రూమ్ లో... ఒకటి ఉంటుంది.. ముగ్గురూ వెళ్లి తీసుకురండి’ అని ముగ్గురినీ ఆదేశించాడు. ముగ్గురూ వెళ్లి ఆ గదిలో ఉన్న ఓ సూట్ కేస్ ని తీసుకొచ్చారు. అప్పుడు చెప్పాడు ఎన్టీయార్... ‘ఆ సూట్ కేస్ లో పది లక్షల క్యాష్ ఉంది. ‘షోలో నేను గెలవలేను’ అనే నమ్మకం ఉన్న కంటెస్టెంట్... ఆ సూట్ కేస్ తీసుకొని రెండు నిమిషాల్లో హౌజ్ బయటకు వచ్చేయండి... టైమ్ స్టార్ట్స్ నౌ’ అన్నాడు. ముగ్గురిలో ఎవరు ఆ సూట్ కేస్ అందుకొని హౌజ్ బయటకు వెళ్లిపోతారా? అని అందరూ ఆసక్తిగా చూడ్డం మొదలుపెట్టారు.
అందర్నీ షాక్ కు గురిచేస్తూ... శివబాలాజీ పైకి లేచాడు. శివ.. బయటకు వచ్చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. పక్కనున్న సాటి కంటెస్టెంట్స్ కూడా. అయితే... తాను నేరుగా తన బెడ్ వద్దనున్న అద్దం వద్దకెళ్లాడు. చక్కగా దువ్వుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఎన్టీయార్ అనుకోకుండా నోరు జారాడు. ‘శివబాలాజీ... నువ్వు తొందర పడకు.. వచ్చి కూర్చో’ అనేశాడు. సో... ఎన్టీయార్ అనాలోచితంగా అలా అనేయడంతో... ‘బిగ్ బాస్’ విజేత ఎవరో దాదాపు అర్థం చేసేసుకున్నారు జనాలు. శివబాలాజీ తల దువ్వుకొని చక్కగా వచ్చి మళ్లీ తన ప్లేస్ లో కూర్చొని ‘పోటీని నేను రెడీ’ అనేశాడు.
ఈ సంఘటన ‘బిగ్ బాస్’ విజేత శివబాలాజీ అని చెప్పకనే చెప్పేసింది.