టికెట్ దొరికింది. ఇక థియేటర్లో విజిల్సే!
on Sep 23, 2017
జూనియర్ మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నాడండోయ్. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం.. తొలిరోజు వసూళ్లు కుమ్మేయడం.. ‘జై’ పాత్రకు అందుతున్న ప్రశంసలు.. ఇవే తారక్ ఆనందానికి కారణాలు. అందుకే... ఆలస్యం చేయకుండా ట్విటర్ ఎక్కేశాడు బుడ్డోడు. ‘ఇంతటి విజయాన్నిచ్చిన అభిమానులకు కృతజ్ఙుడ్ని. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మంచి సినిమాలు చేసి తప్ప. మీ అభిమానాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాను’ అని పోస్ట్ పెట్టాడు తారక్.
ఇదిలావుంటే... ‘జై లవకుశ’ సినిమాకు ఏ మాత్రం సంబంధంలేని మరో వ్యక్తి కూడా... ఈ సినిమా విషయమై ట్విటర్ ఎక్కేసింది. ఆమె ఎవరో కాదు... ఒకనాటి తమిళ లేడీ సూపర్ స్టార్ ఖుష్బూ. ‘హమ్మయ్య... ఎట్టకేలకు ‘జై లవకుశ’ టికెట్టు సంపాదించా. ఫ్యాన్స్ మధ్య చూస్తా. నేను కూడా విజిల్స్ వేయడానికి రెడీగా ఉన్నా’ అని పోస్ట్ పెట్టింది ఖష్పూ. తమిళ నటి అయ్యుండి... ఓ తెలుగు సినిమా విషయంలో ఖష్పూ.. ఇంతలా రియాక్టవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఓ విధంగా ఇలాంటివి కూడా సినిమా వసూళ్లపై ప్రభావం చూపిస్తాయ్. ఏమంటారు?