అబ్బాయ్ డైరెక్టర్‌తో బాబాయ్
on Sep 4, 2017
వామ్మో... 58 ఏళ్ల వయసులో ఈ స్పీడేంటయ్యా బాలయ్యా... సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేశావ్. దసరా కానుకను నెల రోజుల ముందే అభిమానులకు అందించేశావ్. సంక్రాతికి సినిమాను రెడీ చేస్తున్నావ్. ఇవి చాలవన్నట్టు... కాస్త గ్యాప్ కూడా తీసుకోకుండా మళ్లీ వెంటనే ఇంకో సినిమానా!... ఏంటి? ఏమైంది బాలయ్యా?.. ప్రస్తుతం అభిమానులే కాదు... ఇండస్ట్రీ మొత్తం నివ్వెరపోతూ మనసులోనే ఇలా ప్రశ్నించుకుంటున్నారు. ఇటీవలే విడుదలైన బాలయ్య‘పైసా వసూల్’బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. మరో వైపు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సంగంపైనే పూర్తయింది. ఈ జోష్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు బాలయ్య. దాంతో.. ఆ స్పీడ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఓ పక్క కేన్సర్ హాస్పటల్ పనులు. మరో పక్క హిందూపురం అభివృద్ధి పనులు. అటు నటునిగా బిజీ... ఇటు రాజకీయ నాయకుడిగా బిజీ.. ఎలా సాధ్యమవుతోంది? ఇదే అందరి ప్రశ్న.
ఇంతకీ బాలయ్య కమిటైన సినిమా గురించి చెప్పనేలేదు కదూ... పటాస్, సుప్రిమ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గుంటూరుకు చెందిన వాసవి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థవారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ సినిమా షూటింగ్ లో బాలయ్య బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ సినిమా షూటింగ్ పనిలో ఉన్నాడు. ఈ హడావిడి తగ్గాక ఈ సినిమా మొదలవుతుదట. ఈ సినిమాను వేసవి కానుకగా అందించాలనేది బాలయ్య ఆలోచన. బాలయ్య... నిజంగా నువ్వు గ్రేటయ్యా. తేడా సింగా మజాకా!