నేనే రాజు నేనే మంత్రి ఫస్టాఫ్ రివ్యూ
on Aug 11, 2017
చాలా రోజుల తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించడం..బాహుబలి-2, ఘాజీ వంటి వరుస సూపర్హిట్ల తర్వాత తన రేంజ్ పెంచుకున్న రానా దగ్గుబాటి నటించిన సినిమా కావడంతో నేనే రాజు నేనే మంత్రి మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇవాళ వరల్డ్ వైడ్‌గా నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఇండియాతో పాటు కొన్ని దేశాల్లో ప్రీమియర్ షోలు వేశారు. థియేటర్లలో ఉన్న కొందరు మిత్రులు సోషల్ మీడియా ద్వారా సినిమా విశేషాలను తమ మిత్రులతో పంచుకుంటున్నారు. ఒక గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసే జోగేంద్ర (రానా దగ్గుబాటి) తన గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తాడు..అనివార్య కారణాల వల్ల జోగేంద్ర రాష్ట్రానికి మంత్రి అవుతాడు. అయితే ప్రభుత్వంలో, పార్టీలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల తానే సీఎం అవ్వాలని ప్రయత్నిస్తాడు..అదే మిగిలిన స్టోరీ. జోగేంద్రగా రానా నటన సినిమాకు హైలెట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పిక్చరైజేషన్, యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి. ఫుల్ మూవీ రివ్యూ కోసం తెలుగువన్.కామ్‌ను ఫాలో అవ్వండి.