ఆయన డైలాగులు ప్రభాస్ చెబితే?
on Jul 29, 2017
ప్రస్తుతం ప్రభాస్ అస్సలు ఖాళీగా ఉండటానికి ఇష్టపడటంలేదు. వెంటవెంటనే సినిమాలు చేసేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘సాహో ’చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమాను కూడా పట్టాలెక్కించేశాడు ప్రభాస్. గోపిచంద్ తో ‘జిల్’చిత్రాన్ని తెరకెక్కించిన రాధాకృష్ణకుమార్ దర్వకత్వంలో ప్రభాస్ నటించనున్నాడు. యూవీ క్రియేషన్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు సంధించిన స్క్రిప్ట్ వర్క్ అప్పుడే మొదలైందని సమాచారం. మాస్ ప్రజానీకానికి నచ్చే అద్భుతమైన కథ, కథనాలతో ఈ చిత్రం ఉండబోతుందని ఫిలిం నగర్ టాక్. గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 చిత్రాలకు అదిరిపోయే సంభాషణలు అందించిన సాయిమాధవ్ బుర్రాకి ఈ చిత్రానికి మాటలు రాసే బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. విలువైన మూడున్నరేళ్ల కాలం ‘బాహుబలి’కే అంకితం చేసేశాడు ప్రభాస్. అయితే... తన కష్టం వృధా పోలేదు.
అంతర్జాతీయ నటుడి ఇమేజ్ ని ‘బాహుబలి’ అతనికి అందించింది. ‘బాహుబలి’ పాత్రకు తగ్గట్టుగా శరీరాన్నిమలచుకోడానికి ప్రభాస్ పడ్డ శారీరక శ్రమ సామాన్యమైనది కాదు. ఆ సినిమా కోసం కండలు తిరిగిన దేహంతో ధృఢకాయునిగా తయారయ్యాడు ప్రభాస్. అయితే... మామూలు సినిమాలకు ఆ ఫిజిక్ అనవసరం. హెవీ అయిపోతుంది కూడా. అందుకే.. మళ్లీ ‘మిర్చి’నాటి రూపుకు రావడానికి మళ్లీ శ్రమ మొదలుపెట్టాడు. నాజూగ్గా తయారయ్యాడు. ‘సాహో’ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమా కూడా ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా.. అన్ని భాషల్లో విడుదల చేసే విధంగా ..యూనివర్సల్ లుక్ తో ఉంటుందని టాక్.