ప్రభాస్ ‘అనుష్క’ని వద్దు అన్నది అందుకా...!
on Jul 28, 2017
మిర్చి, బాహుబలి తర్వాత ప్రభాస్, అనుష్క మరోసారి సాహూ అనే సినిమాకి జతకట్టనున్నారు అనే వార్తలు వచ్చాయి. రన్ రాజా రన్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమయిన సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి అనుష్క దాదాపు ఖరారు అనుకున్న సమయంలో, లేదు అనుష్కని తీసేసారు అని వదంతులు వ్యాపించాయ్. అయితే, అనుష్కని సాహూకి హీరోయిన్ గా అనుకోవడం, తర్వాత ఆమెని తీసేయడం రెండు నిజమే. కానీ, అనుష్కని తీసేయడానికి కారణం ఏంటి. కొందరు, ప్రభాస్ ఫ్యామిలీ, అనుష్కని తీసేయమని వారించారని... ఇప్పటికే ప్రభాస్, అనుష్కల ప్రేమాయణం అంటూ వస్తున్న వార్తల్ని నిజం చేసినట్టు అవుతుందని... రక రకాల కథనాలు రాసారు. కానీ, అసలు కారణం ఏంటంటే, అనుష్క వెయిట్ ఇంకా తగ్గ లేదు. సైజు జీరో కోసం బరువు పెరిగిన అనుష్క, తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గించుకోలేక పోయింది. ఒక రకంగా, అనుష్కకి సినిమా ఆఫర్లు తగ్గడానికి ఇదే కారణం అంటున్నారు. సాహూ దర్శక, నిర్మాతలు కూడా అనుష్కని పెట్టుకోవడం రిస్క్ అని భావించి, వేరే ఆప్షన్ కోసం చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
Also Read