మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్
on Jul 25, 2017
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలో కాలు పెడుతున్నాడు. ఇంతకు ముందు, శ్రీమంతుడు తమిళ్ లో డబ్ చేయబడి ఒక మోస్తరు వసూళ్లు రాబట్టింది. కానీ, స్పైడర్ ఒకేసారి తెలుగుతో పాటు, తమిళ్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. పాటలు కూడా రెండు భాషల్లో వేర్వేరుగా తీస్తున్నారు. తమిళ మార్కెట్ పై కన్నేసిన మహేష్ బాబు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. అగ్ర దర్శకుడు మురుగదాస్ సినిమా కాబట్టి తమిళ ప్రేక్షకులు కూడా స్పైడర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే, మహేష్ బాబు సినిమాకి తమిళ రైట్స్ రూపంలో అతి పెద్ద డీల్; వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు 25 కోట్లు వెచ్చించి స్పైడర్ తమిళ నాడు, ఓవర్సీస్ రైట్స్ కొన్నారు.
బాహుబలి తర్వాత ఇదే అతి పెద్ద డీల్. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న స్పైడర్ కి తమిళ్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ, లైకా వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేయడంతో రైట్స్ దక్కించుకున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిందనే చెప్పొచ్చు. కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదలయిన స్పైడర్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు పుట్టిన రోజయిన ఆగష్టు 9 కి మరొక టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అదే రోజు, మహేష్ బాబు మరొక చిత్రం భరత్ అనే నేను ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అంటున్నారు.