సీఎంగా మహేశ్..పోటీగా ఎన్టీఆర్..!
on May 26, 2017
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. గట్టిగా రెండేళ్లు ఉన్నప్పటీకి ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇదే దారిలో తెలంగాణ చంద్రుడు కూడా నడిచే అవకాశం ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినట్లు దేశంలో మరే రాష్ట్రంలోను జరగవని జరగమెరిగిన సత్యం. ఎప్పుడు.. ఏ సందర్భాన్ని వదలని సినిమా వాళ్లు ఎలక్షన్ మూవ్‌మెంట్‌ను వదులుతారా..? అందుకే ఆ హీట్‌ను మరింత పెంచేందుకు పొలిటికల్ థ్రిల్లర్స్‌తో ధియేటర్లను ముంచెత్తుతారు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరించబోతున్నారు టాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకులు.
తనకు శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన కొరటాల శివతో మళ్లీ జతకడుతున్నాడు మహేశ్. శ్రీమంతుడు క్లాస్ మూవీ కాగా, ఈ సారి మహేశ్ కోసం పక్కా మాస్ బేస్డ్ స్టోరీని రెడీ చేశాడు కొరటాల. ఈ మూవీకి "భరత్ అను నేను" అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.. దీనిలో మహేశ్ సీఎంగా నటిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ స్టోరీ లైన్ అంతా పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో నడుస్తుందట. వీళ్లేద్దరే కాదు వీరికన్నా ముందే రాజకీయాల్లోకి వచ్చేశాడు భల్లాలదేవుడు. తేజ దర్శకత్వంలో రానా నటిస్తున్న సినిమా కూడా పొలిటికల్ థ్రిల్లరే. ప్రస్తుతానికి వీరి ముగ్గురే రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి మరింత మంది వీరిని ఫాలో అయ్యే అవకాశం ఉంది.