బాలయ్య రాజకీయ సన్యాసం..!
on May 15, 2017
నందమూరి బాలకృష్ణ ని ముఖ్య మంత్రిగా చూడాలన్నది బాలయ్య అభిమానుల ఆశ. ఆయన వేదిక ఎక్కినప్పుడల్లా `సీఎమ్.. సీఎమ్` అంటూ గర్జిస్తుంటారంతా. కనీసం బాలయ్యకు ఓ మంత్రి పదవైనా ఇస్తారని ఆశ పెట్టుకొన్నారు. కానీ.. ఆ ఆశలన్నీ తీరకుండానే నందమూరి బాలకృష్ణ త్వరలోనే రాజకీయ సన్యాసం తీసుకొంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో హిందూపూర్ నియోజక వర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు బాలయ్య. అయితే... అక్కడ అభివృద్ది కార్యక్రమాలేం నిర్వహించలేదు. దాంతో.. బాలయ్య కనిపించడం లేదంటూ హిందూపురం ఓటర్లు బాలయ్యపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అంతేకాదు.... దున్నపోతుపై బాలకృష్ణ డైలాగులు రాసి... కౌంటర్లు వేశారు.
ఇవన్నీ బాలయ్యని బాగా ఇబ్బంది పెట్టాయని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేసినా, ఓడిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నార్ట. దాంతో బాలయ్య మనసు బాగా నొచ్చుకొందని, ఇకపై ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది. ఇది వరకూ బాలయ్య సినిమాలకు దూరం అవుతున్నారని, వందో సినిమా తరవాత రిటైర్మెంట్ తీసుకొంటారని ప్రచారం సాగింది. ఆ తరవాత అదంతా ఉత్తిదే అని తేలింది. చివరికి ఇదీ అలానే అవుతుందేమో. మరి బాలయ్య ఫ్యాన్స్, హిందూపురం ప్రజలు ఏమంటారో??