దిల్‌రాజు జీవితంలో రెండు విషాదాలు
on Mar 13, 2017
టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు దిల్‌రాజు. ఆయన బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా అది సూపర్‌హిట్టే అన్నంతగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు. రీసెంట్గా శతమానం భవతి, నేనులోకల్ సినిమాలు సూపర్హిట్లు అవ్వడంతో పాటు తాతగా ప్రమోషన్ కొట్టేయడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు..అయితే ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ దిల్‌రాజు సతీమణి శ్రీమతి అనిత మరణం ఆయన్ను షాక్‌కు గురిచేసింది. శుక్రవారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అనిత కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత తుదిశ్వాస విడిచారు.
అయితే ఈ సమయంలో దిల్‌రాజు హైదరాబాద్‌లో లేరు ఒక షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు. తన భార్య మరణవార్త తెలుసుకున్న దిల్‌రాజు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. రాజు జీవితంలో ఇది రెండో విషాదం...వివాహానంతరం ఆయనకు ఒక బాబు, పాప పుట్టారు. అయితే ఐదేళ్ల వయసులో కుమారుడు మరణించాడు..ఇది ఆయనకు మొదటి షాక్..ఇప్పుడు తన కష్టసుఖాల్లో పాలుపంచుకున్న భార్య మరణం దిల్‌రాజుకు రెండో షాక్..ఈ కష్ట సమయంలో ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా భగవంతుడిని ప్రార్థిద్దాం.