మహేశ్‌కు ట్రీట్మెంట్..?
on Feb 2, 2017
టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే టక్కున వచ్చే సమాధానం మహేశ్ బాబు. యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో ఆయన ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. మంచి ఫిజిక్‌తో..ముఖంగా చిరునవ్వుతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ప్రిన్స్. అలాంటి మహేశ్ ట్రీట్మెంట్ కోసం మలేషియాకు వెళ్తున్నాడు. కంగారు పడకండి..సూపర్‌స్టార్‌కి వచ్చిన ఇబ్బందేమి లేదు. ఆయనకు ఓ అలవాటు ఉంది..ప్రతీ ఏటా రెండు సార్లు శరీరానికి డీ టాక్సినేషన్ చేయించుకుంటారు.
అంటే శరీరంలో ఉన్న మలినాలు అన్నింటినీ తొలగించుకోవడం అన్నమాట. కొన్ని మెడిసిన్స్, కొంత ఎక్సర్సైజ్, మరికొంత మసాజ్ ద్వారా చెమట రూపంలో శరీరంలో ఉన్న చెమటను బయటకు పోయేలా చేయడమే డీ టాక్సినేషన్. ఈ ఏడాది ఇప్పటికే డెహ్రాడూన్‌లో ఈ తరహా ట్రీట్మెంట్ చేయించుకున్నాడట మహేశ్ రెండవసారి కోసం మలేషియా వెళుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సంభవామి అనే సినిమా చేస్తున్నాడు సూపర్‌స్టార్.