దిల్‌రాజూ... ట్రైలర్ ఇట్టా ఉందేటి??
on Jan 4, 2017
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు.. నేనూ పోటీకి వచ్చేస్తున్నా... అంటూ ప్రకటించేశాడు దిల్‌రాజు. అందుకు తగ్గట్టుగా తన సినిమా శతమానం భవతిని రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలూ చేసేశాడు. ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశాడు. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటి మధ్య తన సినిమాని విడుదల చేస్తున్నప్పుడు కచ్చితంగా ఆ ట్రైలర్... `నభూతో న భవిష్యత్త్` అన్నట్టుండాలి. కానీ... శతమానం భవతి ట్రైలర్ చూస్తే అట్టాంటి ఫీలింగేం కలగడం లేదు. బోల్డంత మంది కాస్టింగ్.. ఫీల్ గుడ్ డైలాగులతో ఈ ట్రైలర్ నిండిపోయినా... టచ్ చేసిన మూమెంట్ ఒక్కటీ లేదు.
అమ్మ ఆవకాయ్ అంజలి.. మర్చిపోలేం అంటూ ఎప్పుడో త్రివిక్రమ్ వాడిపాడేసిన డైలాగ్‌ని ఈ సినిమాలో మరోలా వాడుకొన్నారంతే. `నా జీవితం ఆత్రేయ పురానికి అంకితం` అంటూ శర్వానంద్ ఫీలవ్వడం మినహా.. ఈ సినిమాకి అంకితమైపోవాలన్న ఫీలింగ్ కలిగించడంలో దిల్‌రాజు విఫలమయ్యాడనే చెప్పాలి. ట్రైలర్లో ప్రకాష్రాజ్నిచూస్తుంటే... గోవిందుడు అందరివాడేలేలో ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్ దింపేసినట్టు అనిపిస్తోంది. జయసుధ అయితే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెట్లోంచి నేరుగా... ఇటే వచ్చిందేమో అనిపిస్తోంది. ట్రైలర్లో కొత్తదనం చూపించేస్తే దిష్టి తగిలేస్తుందేమో అని.. సినిమాలో చూపించడానికి దాచేసుకొన్నారేమో. సినిమా కూడా ఇట్టానే ఉందంటే.. దిల్‌రాజుకి దెబ్బడిపోవడం ఖాయం.