మహేష్ ఇలా హ్యాండిచ్చాడేంటి??
on Oct 31, 2016
ఈ దీపావళికి స్టార్ హీరోలంతా తమ ఫస్ట్ లుక్‌లు చూపించి అదరగొట్టారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించిన లుక్‌లు దీపావళి సందర్భంగా బయటకు వచ్చాయి. మహేష్ బాబు - మురుగదాస్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ డిజిటల్ పోస్టర్ ఒకటి దీపావళి సందర్భంగా బయటకు రానున్నదన్న టాక్ వినిపించింది.
ఈ ఫస్ట్ లుక్ కోసం లక్షలు ఖర్చు పెట్టారని, టాలీవుడ్లో కాస్ట్లీ ఫస్ట్ లుక్ ఇదే అని చెప్పుకొన్నారు. అయితే దీపావళికి మహేష్ గిఫ్టులేం ఇవ్వలేదు. దాంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. ఫస్ట్ లుక్ రెడీ అయినా.. టైటిల్ విషయంలో క్లారిటీ లేకపోవడం వల్లే లుక్ బయటకు రాలేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏజెంట్ శివ, అభిమన్యుడు అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఏజెంట్ శివ దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే... ఇంతకంటే మంచి పేరు కోసం చిత్రబృందం అన్వేషణలో ఉన్నట్టు సమాచారం. అందుకే ఫస్ట్ లుక్ బయటకు రాలేదట. అయితే వారం, పది రోజుల్లో మహేష్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్ ఫ్యాన్స్‌కి ఆరోజే నిజమైన దీపావళి.
Also Read