శ్రీమంతుడు విషయంలో తప్పు చేశాడట
on Sep 19, 2016
కొరటాల శివ ఇప్పుడు హ్యాట్రిక్ దర్శకుడు. ఆయన తీసిన మూడు సినిమాలూ హిట్టే. జనతా గ్యారేజ్ అయితే అన్నింటికంటే పెద్ద హిట్టు. అయితే... ఈ సినిమా హిట్టని ఇప్పుడు చెబుతున్నారు. కానీ విడుదల రోజున అందరూ నోరెళ్లబెట్టారు. రివ్యూలైతే ఇది యావరేజ్సినిమా అని తేల్చేశాయి. ఆ రివ్యూలపై కొరటాల శివ ఇప్పుడు నోరు విప్పాడు. సినిమాని సినిమాగా చూడడం లేదని, సినిమా మొదలైతే అందులో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకొన్నారని అందుకే కరెక్ట్ రివ్యూలు రావడం లేదని వాపోతున్నాడు కొరటాల. తన సినిమాలో తప్పులన్న మాట నిజమే అని.. కానీ.. వాటిని చూసి సినిమాని జడ్డ్ చేయడం తప్పు అన్నాడు.
శ్రీమంతుడు క్లైమాక్స్ పై కూడా నెగిటీవ్ రివ్యూలు వచ్చాయని, ఆ సమయంలో యాక్షన్ క్లైమాక్స్ అవసరం అనుకొన్నానని, కానీ.. బారీ ఎమోషన్ క్లైమాక్స్ కూడా తీసుండొచ్చని, ఆ విషయంలో తప్పు చేశానని ఒప్పుకొన్నాడు కొరటాల. జనతా గ్యారేజ్‌లో సమంత పాత్రకు ప్రాధాన్యం లేకుండా చేశారేంటి;?? అనే విమర్శకూ సమాధానం చెప్పాడు. జనతా గ్యారేజ్ అంటే ఎన్టీఆర్ - సమంతల కథ కాదు.. అది జనతా గ్యారేజ్ కథ. అందుకే జనతా గ్యారేజ్ అనేదాన్నే హైలెట్ చేశానంటున్నాడు కొరటాల. అయినా ఇందులో సమంతది చిన్న పాత్రేం కాదని, కాసేపే ఉన్నా ఆ ఇంపాక్ట్ బాగుంటుందని చెప్పుకొచ్చాడు కొరటాల.