దుమ్ము రేపుతున్న ధృవ
on Sep 4, 2016
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హిట్టుకొట్టి చాలా కాలమైంది. తుఫాన్, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ దెబ్బలకు రామ్చరణ్ స్టామినాపై డౌట్లు వచ్చాయి. ఇప్పుడు తన దృష్టంతా ధృవ సినిమాపైనే ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో పనిచేస్తున్నాడు చరణ్. ధృవ ఫస్ట్ లుక్ ఈమధ్యే బయటకు వచ్చింది. ఫస్ట్ లుక్ రాకతో.. ఈసినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా తమిళంలో ఘన విజయం సాధించి అక్కడ రికార్డులు బ్రేక్ చేసిన తని ఒరువన్కి ఇది రీమేక్. సురేందర్ రెడ్డి ఈసినిమాని స్టైలీష్ గా తీసుంటాడని జనాల నమ్మకం. అందుకే ధృవ మార్కెట్ పరంగా ఆశలు రేకెత్తిస్తోంది. సీడెడ్లో ఈ సినిమాని ఏకంగా రూ 9 కోట్లకు కొన్నారని టాక్. చరణ్ సినిమాల్లో ఇది రికార్డ్. సాధారణంగా చరణ్ సినిమాలకు నైజాంలో, ఆంధ్రాలో మంచి రేట్లు వస్తాయి. సీడెడ్లో చరణ్ సినిమాలకు అంత క్రేజ్ లేదు. కానీ అక్కడ ఈ సినిమాకి రూ.9 కోట్లు పలకడం చిత్రసీమలో ఆసక్తిని కలిగిస్తోంది. ఒక్క కడప ప్రాంతంలోనే ఈసినిమాకి రూ.2 కోట్ల ధర పలికిందట. మొత్తానికి చరణ్ సినిమాపై ఆశలు, అంచనాలు పెరుగుతున్నాయి. వాటిని మెగా హీరో ఎంత వరకూ నిలబెట్టుకొంటాడో చూడాలి.