పూరితో సినిమా ఇక 'జనగనమనే...'
on Aug 27, 2016
జనగణమన అనే పదాన్ని మనం నెగిటీవ్ అర్థంలో వాడుతుంటాం. అంటే.. ఇక అంతా అయిపోయింది అనే మీనింగ్ వస్తుందన్నమాట. పూరి జగన్నాథ్ జనగనమన అనే టైటిల్‌తో మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా తీద్దామనుకొన్నాడు. మహేష్ పుట్టిన రోజుకి ఈ టైటిల్‌ని ప్రకటించాడు కూడా. అయితే ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి జనగనమనలా తయారైంది. ఎందుంకటే... ఈ ప్రాజెక్టు ఉండకపోవొచ్చన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. మురుగదాస్ సినిమా పూర్తయ్యాక పూరి - మహేష్‌ల సినిమా పట్టాలెక్కాల్సింది.
పూరి కోరుకొన్నదీ అదే. అయితే... ఇప్పుడు మహేష్ తన నిర్ణయం మార్చుకొన్నాడు. మురుగదాస్ సినిమా తరవాత కొరటాల శివతో ఓ సినిమా పట్టాలెక్కిద్దామని డిసైడ్ అయ్యాడు మహేష్. ఆ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. స్వయంగా కొరటాల శివనే.. 'డిసెంబరు నుంచి మహేష్ సినిమా మొదలెడతాం' అని క్లియర్ కట్‌గా చెప్పేశారు. అంటే.. పూరి - మహేష్‌ల కాంబినేషన్ ఇప్పట్లో లేనట్టే. సో... ఇదే కథ పట్టాలెక్కాలంటే పూరి మరో హీరోని చూసుకోవాల్సిందే.