ఆ టైటిల్ ఎలా పెడతాం చెప్పండి ?
on Jun 30, 2016
గత కొన్ని రోజులుగా మహేష్-మురుగదాస్ ల సినిమాకు టైటిల్ గా "వాస్కోడిగామ"ను ఫిక్స్ చేశారనే వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అందరూ నిజమేనేమో అనేంతలా ఈ టైటిల్ ను సోషల్ మీడియాలో రిజిష్టర్ చేసేశారు. అయితే.. ఈ టైటిల్ కన్ఫర్మేషన్ కోసమని చిత్ర నిర్మాతలను సంప్రదించగా.. "అసలు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాకి అలాంటి టైటిల్ ఎలా పెడతాం చెప్పండి?" అంటూ తిరిగి మమ్మల్ని ప్రశ్నించారు సదరు సినిమా నిర్మాతలు. ఆలోచిస్తే అది కూడా నిజమే అనిపించింది. మహేష్ బాబు హీరోగా వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు "వాస్కోడిగామ" అనే టైటిల్ పెట్టడం సరికాదు. అలాగే.. టైటిల్ ఎంటనేది సినిమా సెట్స్ పైకి వెళ్ళాక మేమే చెప్తాము, దయచేసి లేనిపోని టైటిల్స్ ను ప్రచారం చేయకండని నిర్మాతలు వెబ్ మీడియాకి మొరపెట్టుకొన్నారు.
ఇకపోతే.. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించనున్నాడు!