మహేశ్ సినిమాను ప్రోడ్యూస్ చేస్తున్న ఆరుగురు నిర్మాతలు
on Jun 19, 2016
మా సినిమా ఇంత ఖర్చులోనే కావాలి..ఇంతైతేనే పెట్టగలం అనే రోజులు ఎప్పుడో పోయాయి. సినిమా క్వాలీటి కోసం, అత్యున్నత నిర్మాణ విలువల కోసం ప్రస్తుతం నిర్మాతలు ఎంత కుమ్మరించేందుకైనా వెనుకాడటం లేదు. తాజాగా వచ్చిన సినిమాలే అందుకు నిదర్శనం. ఒకవేళ అంతడబ్బు పెట్టలేనప్పుడు ఒకరిద్దరితో కలిసి సినిమా నిర్మిస్తున్నారు. మహేశ్‌బాబు, మురుగదాస్ కాంభినేషన్లో ఒక మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. బడ్జెట్ 80 కోట్లుగా అంచనా వేశారు. అయితే సినిమా కాస్ట్ ఏ క్షణంలోనైనా పెరిగే అవకాశం ఉండటంతో తలా ఒక చెయ్యి వేసుకోవాలని ఆరు నిర్మాణ సంస్థలు అనుకున్నాయి. దానిలో భాగంగానే ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మాతలుగా వ్యవహరించనుండగా..వీరితో పాటు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, లియో ప్రోడక్షన్స్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌లు నిర్మాణంలో పాలుపంచుకోనున్నాయి. వీళ్లందరికి తోడుగా మన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు.