రామ్ చరణ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు..!
on Jun 7, 2016
రామ్ చరణ్ తేజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ఉన్న అధికారులతో చర్చలు జరుపుతున్నాడు. కొంత మందికి ఆర్డర్లు కూడా వేస్తున్నాడు. ఇదంతా చరణ్ చేస్తున్న ' ధృవ ' సినిమా గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో..చాలా కాలం నుంచీ ఆగుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇప్పుడు జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్లో చెర్రీ పోలీస్ అధికారిగా ఉన్న సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ సెట్ వేశారు. పోలీస్ గెటప్ లో చెర్రీ చాలా స్టైలిష్ గా ఉన్నాడంటున్నాయి మూవీ వర్గాలు. తనీ ఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవదీప్, అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకు సెప్టెంబర్ 30 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని సమాచారం.