నటుడు వినోద్ ఇకలేరు
on Jul 14, 2018
సీనియర్ నటుడు వినోద్ కన్నుమూశారు.. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్స్ర్టోక్తో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.. 1980లో వి.విశ్వేశ్వరరావు డైరెక్షన్లో వచ్చిన కీర్తి కాంత కనకం సినిమాతో హీరోగా పరిచయమైన వినోద్.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.. 300 లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. వినోద్ నివాసానికి వెళ్లి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.