ఆహా... స్నేహ భర్త కూడా!
on Aug 12, 2020
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ప్రారంభమైన తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' కోసం వెబ్ ఫిలిమ్స్ చేస్తున్న నటీనటుల జాబితాలో తెలుగమ్మాయి స్నేహ భర్త ప్రసన్న కూడా చేరాడు. రాధిక భర్త శరత్ కుమార్ కూడా ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు నటీనటులతో పాటు తమిళులతో కూడా ఆహా ప్రాజెక్టులు చేస్తోంది.
భరత్ నీలకంఠన్ దర్శకత్వంలో ప్రసన్నకుమార్ ఇటీవల షూటింగ్ చేశారు. యాంథాలజీగా రూపొందుతున్న వెబ్ ఫిలింలో ఆయన నటించారు. ఇది ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఒక కథలో ప్రసన్నకుమార్ నటిస్తుండగా... ఇతర కథల్లో వరలక్ష్మి శరత్ కుమార్, కిషోర్, రోహిణి జయప్రకాష్, అభిరామి వెంకటాచలం తదితరులు నటిస్తున్నట్లు తెలిసింది.
Also Read