ఇంకా ముందుకొస్తోన్న మెగాస్టార్ `సైరా`
on May 10, 2019
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ హిస్టరీ తో తెరకెక్కుతోన్న చిత్రం `సైరా నరసింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గ్రాండ్ గా హై బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా పై మెగా ఫ్యామిలీ దృష్టి ప్రత్యేకంగా సారించింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం సైరాను కాస్త ముందుగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దసరాకు కాకుండా అంతకంటే ముందే గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సినిమా సైరాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీ జయంతి రోజు అయితే దసరా సెలవులు కూడా కలిసొస్తాయని ఆలోచిస్తున్నారట చిత్ర యూనిట్. గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండటంతో అనుకున్న టైమ్ కు పనులు పూర్తవుతాయా? లేదా? అని కూడా ఆలోచిస్తున్నారట. త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్స్ ఈ చిత్రంలో నటిస్తోన్నారు.