అబ్బబ్బ సన్నీది మామూలు అదృష్టం కాదుగా..!!
on Jul 28, 2016
సన్నీ సినిమాల్లోకి రావడానికి వెతికి మరీ నక్క తోక తొక్కి వచ్చినట్లుంది. అందుకే అమ్మడికి వరుస అవకాశాలు వెతుక్కొని మరీ వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిన సన్నీకి అమీర్ ఖాన్ కూడా ఒక ఛాన్స్ ఇస్తానని పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హృతిక్ సరసన ఒక సినిమాలో కీ రోల్ ప్లే చేయడానికి కూడా సన్నీని సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. ఇలా వరుసగా బడా హీరోల సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతోన్న సన్నీలియోన్ కు ఇప్పుడు ఇంకో బంపర్ ఆఫర్ వచ్చింది.
అదేమిటంటే.. సన్నీలియోన్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కనుందన్న వార్త గత కొద్ది కాలంగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సన్నీ పాత్రలో ఎవర్ని నటింపజేయాలా అని దర్శకనిర్మాతలు బోలెడు ఆడిషన్స్ చేశారు. కానీ.. సన్నీ స్థాయిలో అలరించగలిగే మరో సెక్సిణి వారికి దొరకలేదు. ఇక వేరే అమ్మాయి ఎందుకు సన్నీ జీవితం కాబట్టి సన్నీలియోన్ చేతే ఆ పాత్ర పోషింపజేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చిందట. సన్నీకి చెబితే ఎగిరిగెంటేసినంత పని చేసి మరీ "ఒకే" చెప్పిందట. ఈ చిత్రంలో ఆమె భర్త డానియల్ కూడా ఆమె వెండితెర భర్తగా నటించనున్నాడన్నాడట. భర్తతో కలిసి తన జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో నటించే అవకాశం రావడం అంటే మామూలు అదృష్టం కాదుగా!