సన్నీ లియోన్ సెటైర్ కంగనా మీదేనా?
on Sep 19, 2020
సుశాంత్ సూసైడ్ దగ్గర మొదలైన రచ్చ సన్నీ లియోన్ వరకు వచ్చింది. అతడి మరణం తరవాత బాలీవుడ్ ప్రముఖులను కంగనా రనౌత్ టార్గెట్ చేసింది. తనకు కౌంటర్ ఇచ్చినవాళ్లపై ఎటాక్ చేస్తోంది. ముఖ్యంగా 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్లలో ఆమెను 'సాఫ్ట్ పోర్న్ స్టార్' అంది. ఆ కామెంట్ మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తనను తాను సమర్ధించుకోవడానికి సన్నీ లియోన్ మనకి రోల్ మోడల్ కాకూడదనీ, నటిగా సన్నీని యావత్ భారతదేశం, ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసిందనీ, పోర్న్ స్టార్ అంటే ఫేక్ ఫెమినిస్టులు సడన్ గా వచ్చారని కంగనా రనౌత్ మరో ట్వీట్ చేశారు.
కంగనా రనౌత్ సిస్టర్ రంగోలి కూడా సన్నీ లియోన్ పేరు ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. ఈ కాంట్రవర్సీ తరవాత సన్నీ లియోన్ ఒక పోస్ట్ చేశారు. అందులో కంగనా రనౌత్ పేరు లేదు. కానీ, సెటైర్ కంగనా మీదే అని అందరూ అనుకుంటున్నారు. "మీ గురించి చాలా తక్కువ తెలిసినవాళ్ళు ఎక్కువ చెప్పడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంటుంది" అని సన్నీ లియోన్ పోస్టు చేశారు. లంచ్ డేట్ లో వరల్డ్ డ్రామా చూస్తున్నాని పేర్కొన్నారు.
Also Read