దేవిని దారుణంగా వాడుకున్నా..!
on Aug 6, 2017
స్టార్ డైరెక్టర్ సుకుమార్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి వీరిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత హిట్ కాంబినేషన్. సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటికి దేవినే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక దేవి మ్యుజిక్ మ్యాజిక్ సినిమాలకే ప్లస్ పాయింట్..దేవి చేయి పడితే చాలు మ్యూజిక్ సూపర్ హిట్. సినిమా బంపర్ హిట్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అలాంటి దేవిని తాను వాడుకున్నాని చెప్పాడు సుకుమార్. అసలు సంగతేంటంటే... దేవి.. సుకుమార్ మంచి ఫ్రెండ్స్ అని తెలుసు. ఈరోజు ఫ్రైండ్ షిప్ డే సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిని... మీరిద్దరూ ఫ్రెండ్స్ కావడంవల్లే సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’ అనే చిన్న సినిమాకి మిమ్మల్ని వాడుకున్నారని కొందరి ఫీలింగ్ అని అడుగగా.. దానికి సుకుమార్ నవ్వుతూ.. అవునండి. దేవీని చాలా దారుణంగా వాడుకున్నాను అని చెప్పాడు. ఇక దేవి మాట్లాడుతూ.. అలా ఎవరైనా అనుకుంటే పొరపాటు. సుక్కూ.. ‘కుమారి 21ఎఫ్’ సినిమా తీయాలనుకున్నప్పుడే నాకు తెలుసు.. ఆ సినిమా కోసం నా దగ్గరకు వచ్చి.. అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు.. నేను విషయం ఏంటో చెప్పూ అంటే.. మొహమాటపడుతూ మ్యూజిక్ ఇవ్వాలన్నాడు. ‘ఓస్... ఇంతేనా’ అని అన్నానని చెప్పాడు. ఏది ఏమైనా దేవి మాత్రం తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడన్న విషయం ఒప్పుకోవాల్సిందే.