`ఆర్య` నా లైఫ్ ని మార్చేసింది - బన్ని
on May 7, 2019
`ఆర్య` అల్లు అర్జున్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన సినిమా అని చెప్పవచ్చు. `ఫీల్ మై లవ్` అంటూ బన్నీఆడియన్స్ తన పర్మార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి పదిహేను సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా బన్నీ ఆ సినిమాను గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టారు. అదేమిటంటే...`ఇప్పటికీ నేను అలాగే ఫీలవుతున్నాను` నా లైఫ్ లో `ఆర్య` ఒక మ్యాజికల్ ఫిలిం. ఇది నా లైఫ్ నే పూర్తిగా మార్చేసింది. పదేహేను సంవవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నా. డైరక్టర్ సుకుమార్, దేవిశ్రీప్రసాద్ , దిల్ రాజ్ గార్లకు ఆ సినిమా అంద పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు బన్ని.
ఇక ఆ తర్వాత బన్ని-సుక్కు కాంబినేషన్ లో ఆర్య -2 వచ్చిన విషయం తెలిసిందే. ఇక మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది. ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభించుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా తో హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో వర్క్ చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.