నాగచైతన్య 100 లవ్ హిందీలో
on May 16, 2011
నాగచైతన్య "100% లవ్" హిందీలో నిర్మించనున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, లెక్కల పంతులు సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రం "100% లవ్". నాగచైతన్య "100% లవ్" సినిమా ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతూంది. ఈ నాగచైతన్య "100% లవ్" సినిమాని హిందీలో నిర్మిస్తే చాలా పెద్ద హిట్టవుతుందన్న ఆలోచన ఒక పెద్ద నిర్మాతకు వచ్చింది.
దాంతో ఆయన వెంటనే దర్శకుడు సుకుమార్ ని ఈ విషయమై సంప్రదించాడు. ఆ ఆలోచన నచ్చిన దర్శకుడు సుకుమార్ దానికి వెంటనే అంగీకరించాడు. నాగచైతన్య "100% లవ్" సినిమా హిందీ వెర్షన్ లో నటించబోయే హీరో, హీరోయిన్లు, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులూ దర్శకుడు సుకుమార్ అభీష్టం మేరకే ఉంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.