కంటతడి పెట్టిస్తున్న సోనాలి ట్వీట్
on Aug 11, 2018
హీరోయిన్ సోనాలి బింద్రే గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె న్యూయార్క్లో చికిత్స పొందుతున్నారు.. కాగా ఆమె కుమారుడు ఈరోజు తన 13వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.. ఈ నేపథ్యంలో ఇండియాలో ఉన్న కుమారుడ్ని కలవలేని ఆమె భావోద్వేగంతో సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.. ‘రణ్వీర్.. నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం.. నేను కాస్త ఎక్కువ భావోద్వేగానికి గురవుతున్నానేమో.. అయినా సరే, నీ 13వ పుట్టినరోజుకు ఆ అర్హత ఉంది.. వావ్, ఇప్పుడు నువ్వు టీనేజర్వి.. ఆ నిజాన్ని నమ్మడానికి నాకు కాస్త సమయం పడుతుంది.. నీ మానవత్వం, బలం, దయ పట్ల నేను ఎంత గర్వంగా ఉన్నానో చెప్పలేను.. నా బుజ్జి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మనం కలిసి ఉండలేకపోయిన తొలి పుట్టినరోజు ఇది.. నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీకు నా అమితమైన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది’ అని సోనాలి పోస్ట్ చేసారు.