ఎలక్షన్ టు లొకేషన్... కన్నడ హీరో రెడీ!
on May 18, 2019
లోక్సభ ఎన్నికల కోసమని సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మళ్ళీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత ఆయన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నిజానికి, ఎన్నికలు పూర్తయిన వెంటనే కొత్త సినిమా ప్రారంభిస్తానని ఉపేంద్ర ఎప్పుడో చెప్పారు. అన్నట్టుగానే సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నారు. బి.ఎన్. మౌర్య దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా నటించనున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సోనాల్ మోంటెయిరో హీరోయిన్. న్యాయవాదిగా కీలక పాత్రలో మరో హీరోయిన్ మేఘనా రాజ్ నటించనున్నది. ఈ సినిమాలో ఆదిత్య విలన్. ఉపేంద్ర హీరోగా నటించిన 'ఐ లవ్యూ' అనే సినిమా ఎన్నికలకు ముందే సిద్ధమైంది. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది.