భళారే... బాలయ్యతో చిందులేసింది!!!
on Nov 16, 2018
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `ఎన్టీఆర్. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రెండు పార్ట్ లుగా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కనువిందుగా తెరకెక్కుస్తున్నాడు దర్శకుడు క్రిష్. అయితే ఇటీవల ఈ చిత్రం కోసం `దానవీర శూరకర్ణ` సినిమాలోని `చిత్రం భళారే విచిత్రం` పాటను దుర్యోధనుడి గెటప్ లో ఉన్న బాలపై చిత్రీకరించారు. ఈ పాటలో బాలయ్య సరసన నటి శ్రియ శరన్ నర్తించింది. బాలయ్య సరసన నటి శ్రియ ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించింది. వీరిద్దరి జోడీ బాగుంటుందన్న అభిప్రాయంతో దర్శకుడు భళారే పాటకోసం శ్రియను తీసుకున్నారు. ఈ పాట అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం కథానాయకుడు పార్ట్ జనవరి 9న విడుదల కానుంది. రెండో పార్డ్ అదే నెల 24న విడుదల చేయనున్నారు.