తండ్రీకొడుకుల శృంగార సంభాషణ!
on Jul 26, 2016
ఇద్దరు తండ్రీకొడుకులు ఒక చోట కూర్చుంటే మహా అయితే ఏం మాట్లాడుకొంటారు.. ఇంట్లో విశేషాలో, లేక ఊర్లో సంగతులో లేదంటే బంధువుల గురించో, ఫ్యూచర్ ప్లాన్స్ గురించో మాట్లాడుకొంటారు. కానీ.. ఏ ఇద్దరు తండ్రీకొడుకులు కూడా "సెక్స్" (శృంగారం) గురించి మాత్రం మాట్లాడుకోరు. కానీ.. ఒకవేళ కన్నతండ్రే కొడుక్కి అది కూడా నిండా పదేళ్ళు కూడా నిండని బిడ్డడికి "శృంగారం" (సెక్స్) గురించి చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు ఆచరణ రూపమే "సెక్స్ చాట్ విత్ పప్పు అండ్ పప్పా".
యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ "యూ ట్యూబ్" సిరీస్ ట్రైలర్ ప్రసస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. చిన్నోడు అమాయకత్వంతోనే అడుగుతున్నప్పటికీ.. ఆ ప్రశ్నల్లో బోలెడంత బూతు ఉంది అని కొందరు వాదిస్తున్నప్పటికీ.. 125 కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో "సెక్స్" గురించి మాట్లాడుకోవడంలో తప్పేముందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. ఎంత నాగరీకులం అయినప్పటికీ.. పబ్లిక్ గా "సెక్స్" అనే విషయం గురించి మాట్లాడుకొనే స్థాయికి మన భారతీయులు ఇంకా చేరుకోలేదు. అయితే.. "సెక్స్ చాట్ విత్ పప్పు అండ్ పప్పా" అనేది వెబ్ సిరీస్ కాబట్టి, సెన్సార్ గట్రా అవసరం లేదు కాబట్టి పబ్లిక్ గా కాకుండా ఎవరి మొబైల్ లేదా ల్యాప్ టాప్స్ లో తప్పనిసరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ ఈ వెబ్ సిరీస్ ను జనాలు తప్పకుండా చూస్తారన్నది యాష్ రాజ్ సంస్థ నమ్మకం!