సమంత పెద్ద శూర్పణఖట!!!
on Oct 17, 2018
సమంత పాత్రలను ఎంచుకోవడంలో చాలా పక్కాగా ఉంటారు. ఆమె మొదటి నుంచి గ్లామర్ పాత్రలతో పాటు పర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్రలు చేస్తూ వచ్చింది. `రంగస్థలం` లో డీ గ్లామరైజ్ క్యారక్టర్ చేసి నటనతో ఆకట్టుకుంటూనే అందాలను కూడా ఆరబోసింది. అదిలా ఉంచితే అక్కినేని కోడలయ్యాక సినిమాలు చేస్తున్నా కానీ, చాలా సెలక్టివ్ గా వెళుతోంది. ఇటీవల యూటర్న్ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసి తన ప్రతిభ ఏంటో మరో సారి నిరూపించుకుంది. ఇక మీదట కూడా గ్లామర్ పాత్రలు కాకుండా ఇలా పర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్రలు చేస్తూ తన కెరీర్ ను సాగించాలని డిసైడ్ అయ్యిందట సమంత.
లేటెస్ట్ గా ఆమెకు తదుపరి సినిమాకు సంబంధించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...ఒక పౌరాణిక సినిమా చేయడానికి సైన్ చేసిందట. రామాయణంలో ప్రధానంగా కనిపించే శూర్పణఖలో పాత్రలో నటించనుందట. దీనికి యానిమేషన్ చిత్రాలతో ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకున్న భార్గవ్ డైరక్టర్ గా వ్యవహరించనున్నారట. మొదట ఈసినిమా కోసం కాజల్ ని తీసుకోవాలనుకున్నారట. కానీ సమంత అయితేనే క్యారక్టర్ కి యాప్ట్ అని దర్శక నిర్మాతలు భావించి ఇటీవల ఆమెకు స్టోరీ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో అధికారికంగా తెలిసే అవకాశాలున్నాయట.