బికినీ పోస్ట్ చేసిన సమంత, అక్కినేని అభిమానుల ఆందోళన
on May 30, 2017
సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే సమంతకి తన మనసుకి తోచింది మాట్లాడడం అలవాటు. ఒక్కోసారి, తన వ్యక్తిత్వం తనని విమర్శలకి గురి చేసింది. నేనొక్కడినే పోస్టర్ పై తీవ్ర విమర్శలు చేసి మహేష్ బాబు ఫాన్స్ కోపానికి గురైన సమంత తరవాత జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అక్టోబర్లో అక్కినేని యువ హీరో నాగ చైతన్య ని పెళ్లి చేసుకోనున్న సమంత మళ్ళీ వార్తల్లోకెక్కింది. సండే రోజు తన బికినీ దుస్తుల ఫోటో స్నాప్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి, సమ్మర్ వెకేషన్ వెళ్తున్నానని చెప్పింది. కొందరు దీన్ని సింపుల్ గా, పాజిటివ్ గా తీసుకోగా మరికొందరు తీవ్ర విమర్శలు చేసారు.
'సామ్ నీ ఫాన్స్ ని కించపరచకు... మాకు నువ్వు క్యూట్ గా ఉండడం కావాలి కానీ... అవమాన పరిచేలా కాదు, అని ఒకరు రిప్లై ఇవ్వగా, 'నువ్వు అక్కినేని కుటుంబం పరువు తీస్తున్నావ్' అని ఇంకొందరు తమ అభిప్రాయం వ్యక్తపరిచారు. 'తరాలు నిన్ను చూసి నేర్చుకుంటారు,' అని ఒక ఫాలోవర్ పెట్టిన పోస్ట్ కి ఘాటుగా స్పందించిన సమంత, 'నిజమే తరాలు నేర్చుకుంటాయి. బట్టలు చూసి కానీ... క్యారెక్టర్ చూసి కాదు... అనే నీ తక్కువ ఆలోచన ధోరణికి సిగ్గుపడాలి,' అని అతగాడిపై ఎదురుదాడి చేసింది. అయితే, ఈ విషయంలో అక్కినేని అభిమానులు కొంత వరకు ఇబ్బందిపడినట్టు కనిపిస్తుంది. ఆ కుటుంబంలో అందరు చాలా సాంప్రదాయ బద్దంగా ఉంటారని, సమంత కొంచెం జాగ్రత్తగా మెలగాలని అభిప్రాయపడుతున్నారు.
Also Read