సమంత బేబీ కానిచ్చేసింది!!
on Mar 16, 2019
బాబోయ్ సమంతది మామూలు స్పీడు కాదండీ బాబూ అంటున్నారు టాలీవుడ్ జనాలు. అవును ఒకవైపు భర్త చైతన్యతో `మజిలీ` సినిమా చేస్తూనే మరోవైపు నందిని రెడ్డి దర్శకత్వంలో `ఓ బేబి` చిత్రం కంప్లీట్ చేసింది స్యామ్. ఒకే సమయంలో రెండు సినిమాలు పూర్తి చేయడమంటే మామూలు విషయం కాదు. పక్కా ప్లానింగ్ తో పాటు హార్డ్ వర్క్ చేస్తే కానీ కుదరదు. కానీ డెడికేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన అక్కినేని కోడలు మాత్రం ఈజీ గా రెండు సినిమాలు చేసింది. కొరియన్ లాంగ్వేజ్ లో హిట్టయిన `మిస్ గ్రానీ` కి ఇది రీమేక్ చిత్రం. డెబ్బై ఏళ్లు దాటిన ఓ బామ్మ కుటుంబ సమస్యలతో తన కొడుకు నుంచి విడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు ఫొటో తీయించుకుందామని స్టూడియోకు వెళ్తుంది ఆ బామ్మ అక్కడ జరిగిన కొన్ని అనూహ్య సంఘటనల వల్ల పాతికేళ్ల యువతిగా మారిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కథాంశాన్ని తీసుకుని తెలుగు ప్రేక్షకులకనుగుణంగా మలిచింది దర్శకురాలు నందిని రెడ్డి. సమంత, నాగశౌర్య జంటగా నటించారు. గతంలో సమంతతో `జబర్దస్త్ ` సినిమా చేసింది. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయినా సమంతకు, నందిని రెడ్డికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. దీంతో వెంటపడగా చాలా కాలానికి ఓకే చేసింది సమంత. షూటింగ్ కూడా పూర్తి చేసింది. సమంతానా మజాకా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. బామ్మగా, బేబీగా సమంత ఎలా అలరించనుందో చూద్.