'సడక్ 2' సినిమాపై సుశాంత్ సూసైడ్ ఎఫెక్ట్
on Aug 13, 2020
'సడక్ 2' సినిమాపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని బుధవారం విడుదలైన ట్రైలర్ లైక్స్, డిస్ లైక్స్ చూస్తే సులభంగా చిన్న పిల్లాడికి సైతం అర్థమవుతుంది. ఈ సినిమాకి సుశాంత్ మరణానికి సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే అసలు వివరాల్లోకి వెళ్ళాల్సిందే.
సుశాంత్ ఆత్మహత్య తర్వాత అతడి ప్రేయసి రియా చక్రవర్తి, వెటరన్ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సీనియర్ దర్శకుడితో రియాకి ఏదో సంబంధం ఉందనే పుకార్లు వినిపించాయి. సుశాంత్ ఆత్మహత్య వెనక రియా హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహేష్ భట్ ని సుశాంత్ అభిమానులు ద్వేషిస్తున్నారు. దాంతో అతడు సుమారు 20 ఏళ్ళ తర్వాత దర్శకత్వం వహించిన 'సడక్ 2' ట్రైలర్ మీద ద్వేషాన్ని డిస్ లైక్స్ రూపంలో చూపిస్తున్నారు.
'సడక్ 2' ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. అలాగే, 2.5 మిలియన్స్ కి పైగా డిస్ లైక్స్ వచ్చాయి. లైక్స్ అందులో 10 శాతం కూడా లేవు. మహేష్ భట్ పై ద్వేషానికి తోడు స్టార్ కిడ్స్ సంజయ్ దత్, అలియాభట్, పూజాభట్, ఫేమస్ ప్రొడ్యూసర్ సిద్దార్థ్ రాయ్ కపూర్ తమ్ముడు ఆదిత్య రాయ్ కపూర్ నటించిన సినిమా కావడంతో యాంగిల్ లోనూ ఈ సినిమా పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.