సెక్స్‌రాకెట్ గురించి స్పందించిన రెజీనా
on Jul 9, 2018
టాలీవుడ్ తారలతో అమెరికాలో వ్యభిచారం చేయిస్తున్న సంగతి ఇటు తెలుగు పరిశ్రమనీ, అటు అమెరికాలోని తెలుగువారినీ షాక్‌కు గురి చేసింది. ఈ వివాదంలో ఉన్న తారల పేర్లను పోలీసులు బయటపెట్టకపోయినా కూడా చాలారకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. మూడక్షరాల అమ్మాయి అనీ, వర్ధమాన తార అనీ, కన్నడ నటి అనీ... రకరకాల క్లూస్ ఇస్తూ జనాలని రెచ్చగొడుతున్నాయి. వాటిలో తరచూ రెజీనా పేరు కూడా వినిపించడం విచిత్రం. అయితే ఇన్నాళ్లుగా ఈ వదంతులకు స్పందించని రెజీనా ఇక సమయం వచ్చిందనుకున్నారో ఏమో... తనకీ ఆ సెక్స్రాకెట్కీ ఏమాత్రం సంబంధం లేదని కుండ బద్దలు కొట్టేశారు. కొంతమంది నిజం తెలుసుకోకుండా అనవసరంగా తనను ఇరికిస్తున్నారని వాపోయారు. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతాననని భరోసా ఇచ్చారు.