రవితేజ వెనక్కి తగ్గలేదు
on Aug 26, 2014
మాస్ మహారాజా రవితేజ హీరోగా రాక్‌లైన్ ఎంటర్టైన్ మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్ర(బాబీ)ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘పవర్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ ` ‘‘రవితేజ హీరోగా రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘పవర్’ చిత్రం చాలా పవర్‌ఫుల్‌గా వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఫుల్‌లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. డైరెక్టర్ రవీంద్ర చాలా అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేసి ఒక పవర్ఫుల్ మూవీగా తీర్చిదిద్దారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా రవితేజ పాడిన ‘నోటంకి.. నోటంకి’ సాంగ్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ ఆడియోకి సంబంధించి ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన హండ్రెడ్ పర్సెంట్ సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.
దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ ` ‘‘దర్శకుడుగా నా తొలి చిత్రమే ఇంత పెద్ద బేనర్లో మాస్ మహారాజా రవితేజగారితో చేయడం చాలా ఆనందంగా వుంది. రవితేజగారి ఎంకరేజ్‌మెంట్‌తో ‘పవర్’ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించాను. తప్పకుండా ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. థమన్ మ్యూజిక్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియోని మించిన హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు వుంది’’ అన్నారు.