విజయ్ దేవరకొండ దెబ్బకు స్టార్ హీరో వెనకడుగు...!!
on Sep 10, 2018
ప్రజంట్ ఎవరు ఫామ్ లో ఉంటే వారిని ఫాలో అయిపోతుంటారు నేటితరం కుర్రాళ్లు. అర్జున్ రెడ్డితో యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ `గీత గోవిందం` తో దాన్ని రెట్టింపు చేసుకున్నాడు. వరుస విజయాలతో విజయ్ కు ఒక్కసారిగా విపరీతమైన ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ రేంజ్ కూడా పెరిగిపోయింది. దీంతో విజయ్ సినిమాల మీద సీనియర్ హీరోల సినిమాలు వేయాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే మాస్ రాజా రవితేజకు కూడా ఏర్పడింది.
రవితజేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తోన్న చిత్రం `అమర్ అక్బర్ ఆంటోని`. ఈ చిత్రం మొదట అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం విజయ్ దేవరకొండ నటించిన `నోటా` చిత్రం కారణమట. ఎందుకంటే ఈ చిత్రం కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే వస్తోంది. మొదట రవితేజకు, విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ వార్ తప్పదనుకున్నారు. కానీ విజయ్ దేవర కొండకున్న క్రేజ్‌ని, ఓపెనింగ్స్ ని దృష్టిలో పెట్టుకునీ, అందులో రవితేజ, శ్రీనువైట్ల ఇద్దరూ సక్సెస్ లో లేరు కాబట్టి అన్నీ బాగా ఆలోచించి ` అమర్ అక్బర్ ఆంటోని` చిత్రాన్ని వాయిదా వేయాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో అర్థంచేసుకోవచ్చు. గీత గోవిందం విజయానందంలో ఉన్న విజయ్ కి నోటా ట్రైలర్ మరింత ఉత్సాహాన్నిచింది. ఇప్పటి కే నోటా చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.