English | Telugu

చిరంజీవి ఆ సినిమా కథే... ‘రంగస్థలం’ కథ!

on Dec 16, 2017


‘రంగస్థలం సినిమా కథ... చిరంజీవి పాత సినిమా కథకు కాపీ’. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఎక్కడ విన్నా ఇదే గోల. చిరంజీవి కూడా ఇటీవలే ఈ సినిమా చూసి దర్శకుడు సుకుమార్ కి కొన్ని సూచనలు చేశారట. తన సినిమా పోలికలు కనిపిస్తున్నాయనీ... వాటిని ఇంకాస్త బెటర్ గా తీయాలని సుకుమార్ కి సూచించారట మెగాస్టార్. ‘రంగస్థలం’.. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ. ఇది అందరికీ తెలిసిందే. సుకుమార్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ మోడ్రన్ టచ్ తో సాగేవే. ఇదీ అందరికీ తెలుసు. అయితే...ఈ దఫా సుకుమార్ ఇప్పటివరకూ టచ్ చేయని జానర్ లో ‘రంగస్థలం’ చేస్తున్నాడు. దాంతో.. ‘అసలు ఎలాంటి కథను ఎంచుకొని ఉంటాడు?‘ అని జనాల్లో ఎక్కడ లేని ఆసక్తి. ఇంతకీ చిరంజీవి సినిమాల్లో ఏ సినిమా కథను సుకుమార్ కాపీ కొట్టాడు? అనేగా మీ డౌట్. ఆ సినిమా పేరు ‘ఊరికిచ్చిన మాట’. ఇక ‘ఊరికిచ్చిన మాట’ కథ విషయానికొస్తే... అదొక కుగ్రామం. ఆ ఊళ్లో ఉన్నట్టుండి కలరా సోకి అందరూ చనిపోతుంటారు. దాంతో ఊరొదిలి జనాలు వలస పోతుంటారు. అందుకే... ఊరిని కాపాడటానికీ,, ఊరి జనాల అకాల మరణాలను ఆపడానికి తన తమ్ముడ్ని డాక్టర్ చదివించాలనుకుంటాడు చిరంజీవి. తమ్ముడేమో సుధాకర్. డాక్టర్ చదువు కోసం పట్నం వెళ్లిన సుధాకర్... ఎంబీబీఎస్ పూర్తి చేసి.. అక్కడే  ఆసుపత్రి పెట్టుకొని సెటిల్ అయిపోతాడు. అన్నమాట తప్పిన తమ్ముడ్ని... ఊరికిచ్చిన మాట కోసం తన్ని భుజాలపై ఎత్తుకొస్తాడు చిరంజీవి. ఇది కథ. ఇదే కథ పోలికలు ‘రంగస్థలం’లో కూడా ఉన్నాయట. 1981లో వచ్చిన ‘ఊరికిచ్చిన మాట’ బాగానే ఆడింది. మరి ‘రంగస్థలం’ పరిస్థితి ఏంటో చూడాలి.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here