గుణ `హిరణ్యకశ్యపుడు`గా రానా!!
on Jun 1, 2019
తొలి టాకీ చిత్రంగా భక్త `భక్త ప్రహ్లాద` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. అయితే మరల ఆ భక్త ప్రహ్లాదుడి, హిరణ్యకశ్వపుడి స్టోరిని తెర మీదకు తీసుకరావడానికి రెడీ అవున్నాడు దర్శకుడు గుణ శేఖర్. రుద్రమదేవి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు మరోసారి ఈ ప్రయోగానికి సిద్దమయ్యాడు. ఇక హిరణ్యకశ్యపుడుగా టైటిల్ రోల్ లో రానా నటిస్తూ సొంత బేనర్ లో నిర్మించడానికి సన్నహాలు చేస్తున్నాడట. దీనికి సంబంధించిన వార్తలు చాలా కాలంగా వినబడుతూ వస్తున్నా ...కూడా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. ఇక తాజాగా డైరక్టర్ గుణశేఖ్ దీనికి సంబంధించిన న్యూస్ ను తన ట్టిట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. `` గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రానా హిరణ్యకశ్యపునిగా నటించబోతున్నాడు . త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నామని రాసుకొచక్చాడు గుణశేఖర్. మరో ప్రయోగానికి రానా రెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది.