చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రానా!!!
on Dec 15, 2018
`ఐతే` , అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా ఇలా టైటిల్స్ మాత్రమే కాదు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ...విభిన్న చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. అలాగే ఫస్ట్ సినిమా లీడర్ తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు హీరో రానా. ఇలా విభిన్నంగా ఆలోచించే ఈ ఇద్దరి కలయికలో ఓ ఆసక్తికరమైన సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇటీవల రానాకు చంద్రశేఖర్ ఏలేటి ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పారట. స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. అయితే ప్రజంట్ రానా తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కుతోన్న @హాథీ మే రీ సాథీ` చిత్రంలో, తెలుగు, తమిళంలో రూపొందుతున్న `1945` లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాక చంద్ర శేఖర్ ఏలేటి సినిమా సెట్స్ మీదకు వెళ్ల నుందట.