రానా సినిమా దిమ్మ తిరిగే బిజినెస్... విడుదలకి ముందే లాభాలు...
on Jul 26, 2017
రానా దగ్గుబాటి కెరీర్ బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత గా విభజించాల్సి ఉంటుంది. ఎందుకంటే, రానాతో సినిమా తీయడానికి ఏ అగ్ర దర్శకుడు, నిర్మాత ఇంతకు ముందు ధైర్యం చేయలేదు. అలాంటిది, బాహుబలి అన్ని భాషల్లో భారీ విజయం సాధించడంతో, రానా కాల్ షీట్ల కోసం క్యూలు కడుతున్నారు. రానా టీవీ షో నం 1 యారి కూడా నం 1 ప్రోగ్రాం గా ఆదరింపబడుతుంది. ప్రస్తుతం, రానా తన తదుపరి చిత్రం నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. బాహుబలి పుణ్యమా అని, ఈ సినిమాని తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. కేవలం, సాటిలైట్, ఇంటర్నెట్ బిజినెస్ యే 19 కోట్లు సాధించిందంటే సినిమా పై ఉన్న హైప్ ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే, తెలుగు కన్నా హిందీ సాటిలైట్ హక్కులే నిర్మాతకి ఎక్కువ డబ్బులు తెచ్చి పెట్టింది.
తెలుగు సాటిలైట్ రైట్స్ 3 కోట్లకి అమ్ముడుపోగా, ఇంటర్నెట్ హక్కులు 2 .5 కోట్లు తెచ్చి పెట్టింది. ఇక, హిందీ సాటిలైట్ రైట్స్ 7 కోట్లు, ఇంటర్నెట్ బిజినెస్ 2 .5 కోట్లు చేసింది. తమిళ్ సాటిలైట్ హక్కులు 2 కోట్లు, మలయాళం సాటిలైట్ 1 .5 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తానికి, సాటిలైట్, ఇంటర్నెట్ బిజినెస్ యే అన్ని భాషల్లో కలిపి 19 కోట్లు చేసి, నిర్మాతలకి విడుదలకి ముందే లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం, రానా కి ఇక అన్ని భాషల్లో మంచి మార్కెట్ ప్రాప్తించినట్లే!